ఒంట్లో కొవ్వు పేరుకుపోకుండా కాపలాకాసే పండు.. ఏమిటో తెలుసా..?
బిల్వ పండు.. దీనినే మారేడు పండు అని కూడా అంటారు. దీని రసం తాగితే రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది.
ఇది జీర్ణశయాంతర సమస్యలను తగ్గిస్తుంది, పేగు మంటను అరికడుతుంది.
ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, డయాబెటిస్ సమస్యలను నివారిస్తుంది.
వేసవికాలంలో మన శరీరానికి తక్షణ చల్లదనాన్ని, శరీరానికి కావాల్సిన హైడ్రేషన్‌ను అందిస్తుంది.
ఈ పండును డైట్‌లో చేర్చుకోవడం వల్ల వేడి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి హాని కలిగించకుండా కాపాడుతుంది.
దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.
అంతేకాకుండా ఈ పండు తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అస్సలు పెరగనివ్వదు.
ఆయుర్వేద ప్రకారం ఇందులో హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. మంచి తాజా దనాన్ని అందిస్తుంది. ఎక్కువ దాహం వేయకుండా చేస్తుంది.
బిల్వ పండులోని ఫైబర్ శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేస్తుంది.
చింత లేకుండా చింత గింజలు తీసుకుంటే.. మోకాళ్ల నొప్పులు మటాష్..!