బయోటిన్ లోపం వల్ల  జుట్టు రాలడం, బలహీనపడటం వంటి సమస్యలు ఎదురవుతాయి.

మీ ఆహారంలో బయోటిన్ రిచ్ ఫుడ్ చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు.

బయోటిన్ పుష్కలంగా ఉండే సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్లు బయోటిన్ యొక్క అద్భుతమైన మూలంగా పరిగణించబడతాయి. ఇవి మూలాల నుండి జుట్టును బలోపేతం చేస్తాయి.

అవకాడోలో బయోటిన్‌తో పాటు ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు,ఫైబర్ , విటమిన్ E పుష్కలంగా ఉంటాయి.

వీటిని తినడం వల్ల జుట్టు ఒత్తుగా, దృఢంగా మారుతుంది.

బాదంపప్పులు బయోటిన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్ ఇ యొక్క మంచి మూలం.

బాదం జుట్టును బలోపేతం చేయడమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది.