ఆకాశంలో ఎగురుతూ నిద్రపోయే పక్షులు ఇవే..
ఆల్పైన్ స్విఫ్ట్.. ఈ వలస పక్షులు గాల్లో నెలలపాటు ప్రయాణించేటప్పుడు తమ మెదడులోని ఒక భాగానికి విశ్రాంతినిస్తాయి.
ఫ్రిగేట్ బర్డ్స్.. ఈ సముద్ర పక్షులు వారాలపాటు ఎగరగలవు. ఇవి కూడా ఎగిరేసమయంలో సగం మెదడునే ఉపయోగిస్తాయి.
మాంక్స్ షేర్‌వాటర్స్.. ఈ సముద్ర పక్షులు వలస వెళ్లే సమయంలో స్లీప్ ఫ్లైయింగ్ చేస్తాయి.
వైట్ చిన్న్‌డ్ పెట్రెల్స్.. గంటల తరబడి గాల్లో ఎగురుతూ శరీరంలో తక్కువ బలల ఖర్చు చేయడానికి నిద్రపోతాయి.
నార్తరన్ గాన్నెట్స్.. వలసలు చేసే సమయంలో ఈ పక్షి కాసేపు భూమి, కాసేపు గాల్లో నిద్రపోతుంది.
రెడ్ ఫూటెడ్ బూబీ.. సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే ఈ పక్షులు స్లో వేవ్ స్లీప్ టెక్నిక్‌ని పాటిస్తాయి.
బార్ టెయిల్డ్ గాడ్‌విట్స్.. ఈ పక్షులు గాల్లో ఎగిరే సమయంలో మెదడులో ఒక భాగంతో కాసేపు మరో భాగంతో కాసేపు నిద్రపోతాయి.