రక్తాన్నీ పీల్చే జీవులు ఇవే..

ఆడ దోమలు మనషులు, జంతువుల రక్తాన్ని ప్రొటీన్ కోసం పీలుస్తాయి. గుడ్లు పెట్టడానికి ఇది వాటికి అవసరం.

జలగలు.. మంచి నీటిలో ఉంటూ అందుబాటులో ఉన్న పెద్ద జంతువులు, మనుషుల రక్తాన్ని పీలుస్తాయి.

పేను.. ఈ పురుగులు మనుషులు, జంతువుల శరీరంపై చేరి రక్తం పీల్చి జీవిస్తాయి.

వ్యాంపైర్ బ్యాట్స్.. అమెరికాలో లభించే ఈ గబ్బిలాలు జంతువులు, పక్షులను గాయపరిచి వాటి రక్తాన్ని తాగుతాయి.

బెడ్ బగ్స్.. బెడ్రూమ్ లో ఈ పురుగులు చేరి మనుషుల రక్తాన్ని పీలుస్తుంటాయి.

కిస్సింగ్ బగ్స్, ఫ్లీస్.. ఈ పురుగులు జంతువులు, పక్షుల రక్తాన్నీ పీలుస్తాయి.