ఆదాయ పన్ను పాత విధానం, కొత్త విధానం శ్లాబుల మధ్య తేడా తెలుసా?
కొత్త విధానంలో రూ.4 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. పాత విధానంలో ఈ పరిమితి రూ.3 లక్షలే
కొత్త విధానంలో 4-8 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 5% ట్యాక్స్. పాత విధానంలో రూ.3-7 లక్షలకు 5% ట్యాక్స్.
కొత్త విధానంలో 8-12 లక్షల ఆదాయానికి 10% పన్ను చెల్లించాలి. పాత విధానంలో 7-10 లక్షలకు 10 శాతం పన్ను.
12-16 లక్షల ఆదాయం ఉంటే కొత్త విధానంలో 15 శాతం పన్ను. పాత విధానంలో 10-12 లక్షలకు 15 శాతం.
ఆదాయం రూ.16-20 లక్షలు ఉంటే కొత్త విధానంలో 20 శాతం పన్ను. అదే పాత విధానంలో 12-15 లక్షలకే 20 శాతం
కొత్త విధానంలో రూ.20-25 లక్షల ఆదాయానికి 25% ట్యాక్స్. కానీ పాత విధానంలో వార్షికాదాయం రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను.
ఇంకా కొత్త విధానంలో రూ.25 లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉంటే 30 శాతం ఇన్‌కం ట్యాక్స్ చెల్లించాలి.