ఓర్ని.. చెర్రీ పండులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?
చెర్రీ పండ్లు చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో, స్వీట్స్ లలో ఉపయోగిస్తుంటారు..
ఈ పండ్లు ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.
చెర్రీస్‌లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
చెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
చెర్రీస్‌లో ట్రిప్టోఫాన్ అనే ఒక అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహిస్తుంది.
చెర్రీస్‌లో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
చెర్రీస్‌లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
చెర్రీస్‌ను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
గమనిక: ఈ వివరాలు పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.
Image Credit/Pixels