ఎండాకాలంలో వేడి గాలుల కారణంగా శరీరం నీరసించిపోతుంది. త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
వేడి వాతావరణం, ఎండల తీవ్రత వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అందుకే దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల ఎండాకాలంలో మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
దాల్చిన చెక్క నీరు తాగితే శరీరంలో పిహెచ్ బ్యాలెన్స్ గా ఉంటుంది. శరీరం టెంపరేచర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
బాడీ డిటాక్స్.. ఈ నీరు తాగితే శరీరంలో మలినాలు, విష పదార్థాలు బయటికి విసర్జింపచేస్తుంది.
వేసవిలో కలిగే అలసటను కూడా తగ్గిస్తుంది.
కడుపులో గ్యాస్ సమస్య తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
ఇన్సులిన్ రెజిస్టెన్స్‌ని పెంచి బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
సినామన్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటి బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. వీటిని తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
జీర్ణక్రియని వేగం చేసి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
దాల్చిన చెక్కతో పాటు నిమ్మకాయ, తేనె కలిపి తాగితే నీరసం ఉండదు.
ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది.
ఉదయాన్నే మెంతి నీరు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?