ఈ అలవాట్లతో కిడ్నీలకు ప్రమాదం..

ఎక్కువ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తినడం వల్ల కిడ్నీల ఆరోగ్యానికి ప్రమాదం.

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరిగి కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది.

బర్గర్లు, పిజ్జాలు ఎక్కువగా తినడం వల్ల సోడియం, అనారోగ్యకరమైన ఫ్యాట్స్ కిడ్నీలపై ఒత్తిడి పెంచుతాయి.

తక్కువగా నీరు తాగడం వల్ల కూడా కిడ్నీలలో రాళ్లు పేరుకుపోవడానికి కారణం.

మద్యం, ధూమపానం వంటి అలవాట్లతో కిడ్నీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.

తక్కువ నిద్ర పోవడంతో కిడ్నీలకు తగిన విశ్రాంతి లభించదు.