చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
ఇవి చలికాలంలో వచ్చే జలుబు,ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
ఖర్జూరంలో సహజ చక్కెర ఉంటుంది.ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
ఖర్జూరంలో ఫైబర్ ఉంటుంది.ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.
ఖర్జూరంలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.
ఖర్జూరంలో ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.