బ్రెక్ ఫాస్ట్‌లో వీటిని తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో పడ్డట్టే..

ఉదయాన్నే నూనెతో కూడిన ఆహారాలు తినడం మంచిది కాదు. దీనివల్ల జీర్ణక్రియ ఇబ్బందులు వస్తాయంటున్నారు.

ఖాళీ కడుపుతో నూనె ఆహారాలు తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

నూనె ఆహారాలు కడుపులో ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తాయి.

వీటిలో అధికంగా కేలరీలు ఉండటం వల్ల బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

అధికంగా నూనె ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

అంతేకాకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.

దీనికి బదులుగా పండ్లు, వోట్మీల్, ఉప్మా, ఇడ్లీ, దోస వంటివి కూడా ఉదయాన్నే తీసుకోవచ్చు.

పాలు, పెరుగు, మజ్జిగ వంటివి ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి.

ఉడికించిన గుడ్లు ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రోటీన్ లభిస్తుంది.