చలిని తగ్గించడానికి చాలా మంది చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తుంటారు.
మరి చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే ఎలాంటి నష్టాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలనుకుంటే సీజన్ కు అనుగుణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
వేడి నీళ్లతో స్నానం చేస్తే.. శరీరంలో నీరసం ఏర్పడుతుంది. అంతే కాకుండా శక్తి కోల్పోయినట్లు అనిపిస్తుంది.
వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కళ్లపై చెడు ప్రభావం పడుతుంది. కళ్లలో తేమ తగ్గి, కళ్లు ఎర్రబడటం, నీరు కారడం వంటివి జరుగుతాయి
వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టుపై తేమ తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు గరుకుగా తయారవుతుంది.
చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే.. సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది. అందుకే ఎక్కువ సేపు వేడి నీటితో స్నానం చేయకూడదు
వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మంపై తేమ తగ్గుతుంది. దీని వల్ల దురద, అలెర్జీ సమస్యలు పెరుగుతాయి