ప్రకృతిలో ఎన్నో వింతలున్నాయి. ఒక పక్షి ఇతర పక్షుల, పరిసరాల సౌండ్ మిమిక్రీ చేస్తుందని తెలుసా?
లైర్ బర్డ్ కనీసం 20 రకాల ఇతర పక్షల శబ్దాలను మిమిక్రీ చేస్తుంది.
అంతేకాదు తనకు సమీపంలో ఉండే ఏదైనా వస్తువు శబ్దం విని వెంటనే దాని లాగే కూత వేస్తుంది.
కెమెరా క్లిక్ మనే శబ్దం, షట్టర్ మూసే శబ్దం ఇలా ఏదైనా వింటే చాలు అలాగే దింపేస్తుంది.
సాధారణంగా ఈ పక్షులు ఇతర ఆడ పక్షులను ఆకర్షించడానికి ఈ శబ్దాలు చేస్తాయి.
వాటితో మేటింగ్ చేసేందుకు ఎన్నో రకాల వింత చేష్టలు కూడా చేస్తాయి.
దీని మిమిక్రీ ఎంత సహజంగా ఉంటుందంటే ఇతర పక్షులు ఈజీగా మోసపోతాయి.
కొన్ని సందర్భాల్లో మనుషులను కూడా ఇవి మిమిక్రీ చేస్తున్నట్లు తేలింది.
ఇది సాధారణంగా సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియా ప్రాంతాల్లో నివసిస్తుంది.
తేమశాతం ఎక్కువగా అడవులు, చెట్లలో రాత్రిళ్లు ఇది నివసిస్తుంది.
కర్బూజా గింజలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలో