తలంబ్రాల అంతరార్ధం ఏంటో తెలుసా?

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ ప్రధాన ఘట్టం. పెళ్లికి వచ్చిన బంధువులు నూతన జంట తలపై పసుపు కలిపిన బియ్యం వేస్తారు. వీటిని అక్షింతలు అంటారు.

అదే వధూవరులు ఒకరికొకరు తలపై వేసుకుంటే వాటిని తలంబ్రాలు అంటారు. తలపై వీటిని వేసుకోవడం వెనుక అంతరార్ధం ఏంటంటే?

వధూవరులకు మంచి సంతానం, సౌఖ్యం కలగాలని కోరుతూ వధువు శిరస్సు పై మొదటిగా వరుడు తలంబ్రాలు పోస్తారు. వధువు రాకతో ఇంట్లో ధన ధాన్యాలు కలగాలని వరుడు కోరుకుంటాడు.

మెదడు స్థానంలో తగిలేటట్లు శిరస్సుపై తలంబ్రాలను వేయడం ద్వారా ఆశీర్వాదమంత్రం బలం చేరి బుద్దిని ఇస్తాయని నమ్మకం.

దీంతో పాటు ఎవరిబంధువులనైనా సమానంగా చూసుకుంటూ అందరితో కలిసి మెలగాలని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు.

ఇలా మూడు సార్లు పోసుకున్నాక.. వధూవరులిద్దరూ పోటీపడి మరి తలంబ్రాలు పోసుకుంటారు.

ఈ రోజుల్లో కొంత మంది దీనిని వేడుకగా జరుపుకుంటూ.. మార్కెట్లో దొరికే థర్మాకోల్ బాల్స్ ను వినియోగిస్తున్నారు.