ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు ఎందుకు?

ఉల్లి కోస్తునప్పుడు అది మనల్ని ఏడిపించినా.. అది కలిగించే ప్రయోజనాలు మాత్రం ఎన్నో ఉన్నాయి.

ఉల్లిపాయలో అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఉల్లిపాయ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. వేసవిలో వచ్చే వ్యాధులను నివారిస్తుంది.

వీటిని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరాన్ని లోపలి నుంచి చల్లగా ఉంచుతుంది.

దీనిలో ఉండే పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఉల్లిలో అల్లిసిన్, ఇతర సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

అంతేకాకుండా చర్మాన్ని మెరిపించడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడతాయి.

ఉల్లిపాయ రసం కాలిన ప్రదేశానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని చల్లబరుస్తుంది, బొబ్బలు రాకుండా నిరోధిస్తుంది, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది.

ఇందులో ఉండే క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు మెదడు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఉల్లిపాయలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.