ప్రతి రోజు యాపిల్ తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
యాపిల్ లో విటమిన్ ఏ, సి, క్యాల్షియం, పొటాషియం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
యాపిల్ ప్రతి రోజు తింటే క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బుల వంటి వ్యాధులు రావు.
యాపిల్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయి.
వీటిలోని బి కాంప్లెక్స్ , విటమిన్స్ నాడీ వ్యవస్థ మెరుగుదలకు దోహదం చేస్తాయి.
యాపిల్ గుండె ఆరోగ్యానికి కూడా సహాయ పడుతుంది
యాపిల్‌లోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
యాపిల్ తినడం వల్ల శరీరంలోని చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది.
యాపిల్ లోని ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
యాపిల్స్ తినడం వల్ల, చర్మం కాంతివంతంగా మారుతుంది.