'హాస్య యోగా' పేరుకు తగినట్లు గానే నవ్వుతూ వివిధ యోగాసనాలు వేయడమే

నవ్వుతూ యోగాసనాలు చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

నవ్వుతూ యోగా చేయడం వల్ల ఒత్తిడి కలిగించే హర్మోన్లు తగ్గిపోతాయి

దీంతో పాటు రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీబాడీలు శరీరంలో విడుదల అవుతాయంటున్నారు

ఇలా చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు ఏకాగ్రత కూడా మెరుగుపడుతుందని వెల్లడిస్తున్నారు

అయితే, నవ్వే క్రమంలో నేచురల్ పెయిన్ కిల్లర్స్​‌గా భావించే ఎండార్ఫిన్లు మన శరీరంలో విడుదలవుతాయి

నవ్వడం వల్ల రక్తనాళాలు కాస్త వ్యాకోచిస్తాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది

వీటితో పాటు ఆత్మవిశ్వాసాన్ని, క్యాలరీలు కరిగించుకోవడానికి ఈ యోగా పద్ధతి చక్కగా దోహదం చేస్తుంది

హాస్య యోగా ఒంటరిగా కాకుండా బృందంతో కలిసి చేస్తే మరింత సరదాగా ఉంటుంది Images Credit: Pexels and Pixabay