స్నానం, కూర్చోవడం, నడవడం, ఇతరపనులు ఇవన్నీ ఆరోగ్యమే. ఏది చేయకుండా ఉండటమే అనారోగ్యం.

ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదంటారు. అలాగే స్నానం చేశాక కొన్ని పనులు చేయకూడదు

స్నానం చేసిన వెంటనే నీరు తాగకూడదట. దీనివల్ల శరీరంపై చెడు ప్రభావం పడే అవకాశాలున్నాయి.

స్నానం చేసిన వెంటనే నీరు తాగితే అది రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. రక్తపోటులో మార్పులొస్తాయి.

హెయిర్ డ్రైయర్ తో జుట్టును ఆరబెట్టకండి. జుట్టు మృదుత్వం పోయి.. మరింత పొడిబారి, రాలిపోయే అవకాశాలెక్కువ.

స్నానం చేసిన వెంటనే టవల్ తో బలంగా రుద్దకూడదు. చర్మం డీ హైడ్రేషన్ కు గురికావచ్చు. సున్నితమైన టవల్ తో రుద్దాలి.

స్నానం చేసిన వెంటనే ఎండలోకి వెళ్తే.. ఆ కిరణాల వల్ల శరీరం వేడెక్కి అనారోగ్యానికి గురికావొచ్చు.

ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటిస్తే.. చర్మంతో పాటు మీరు ఆరోగ్యంగా ఉంటారు.