మనం కూరగాయలు, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఎక్కువగా ఫ్రిజ్ వాడుతుంటాం.

బయటతో పోలిస్తే.. కొన్ని రకాల కూరగాయలు, ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.

కానీ కొన్ని సాధారణ ఆహారాలు ఫ్రిజ్‌లో ఉంచితే ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. అవేంటంటే..

అరటి పండ్లను ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే అవి బయటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

టమాటోలు ఫ్రిజ్‌లో పెడితే త్వరగా పాడైపోతాయి.అందుకే ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

నారింజలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని రసంలో ఎక్కువ శాతం ఎండిపోతుంది. అందుకే నారింజ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదు.

పుచ్చకాయను ఫ్రిజ్‌లో కూడా ఉంచకూడదు. పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని పోషకాలు నశిస్తాయి.