టీ త్రాగడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. కానీ టీ ఎక్కువగా త్రాగడం ఆరోగ్యానికి చాలా హానికరం.

ఆరోగ్యంగా  ఉండేందుకు  కొన్ని టీలు  మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.

లావెండర్ టీ :  ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. దీనిని తరుచుగా త్రాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది

బాదం టీ: ఇందులో  ప్రొటీన్ విటమిన్ ఇ తో పాటు అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

గ్రీన్ టీ: చాలా మంది ప్రతి రోజు ఉదయం టీ త్రాగడానికి బదులుగా గ్రీన్ టీ త్రాగుతుంటారు.

అధిక బరువు సమస్యతో  ఇబ్బంది పడుతున్న వారు గ్రీన్ టీని రోజుకు 2 లేదా 3 సార్లు త్రాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.