క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే.. సరైన సమయంలో చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది.

క్యాన్సర్ ను గుర్తించడానికి చేయాల్సిన వైద్య పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లడ్ టెస్: రక్త పరీక్షలు చేయడం ద్వారా  శరీరంలోని అసాధారణ కణాలు.. హార్మోన్లు, ఎంజైమ్‌లను గుర్తించవచ్చు.

క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు బ్లడ్ టెస్ట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.

ఎక్స్ రే: ఊపిరితిత్తులు, ఎముకల క్యాన్సర్‌ను ఎక్స్ రే ద్వారా తెలుసుకోవచ్చు.

బయాప్సీ: శరీరం నుంచి కణజాల నమూనాను తీసుకుని పరీక్షిస్తారు. ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు.

MRI: ఎమ్‌ఆర్‌ఐ ద్వారా శరీరంలోని సున్నితమైన భాగాల్లోని క్యాన్సర్ కణాలను గుర్తించవచ్చు.

ఎండోస్కోపీ: కిడ్నీ, పొట్ట, ఊపిరితిత్తుల్లో ఉన్న క్యాన్సర్ కణాలను గుర్తించడానికి ఎండో స్కోపీ ఉపయోగపడుతుంది.

పీఎస్ఏ: ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడంలో పీఎస్ఏ పరీక్ష ఉపయోగపడుతుంది.

సీటీ స్కాన్: అంతర్గత అవయవాల్లో పెరిగిన క్యాన్సర్ కణాలు, వాటి స్థానం, పరిమాణాన్ని సిటీ స్కాన్ ద్వారా గుర్తించవచ్చు.