మలాయి కుల్పీ అంటే ఇష్టపడని వారుండరు.

ఎండాకాలంలో ఎక్కువగా అమ్ముడు పోయే ఐస్ క్రీమ్స్‌లో కుల్ఫీ ఒకటి.

దీన్ని తయారు చేయడం చాలా ఈజీ. ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఫాలో అవ్వండి.

కావాల్సినవి: 2 కప్పులు ఫుల్ ఫ్యాట్ మిల్క్, 1 కప్ హెవీ క్రీమ్, 1/2 కప్ షుగర్

కావాల్సినవి: 1/4 టీస్పూన్ యాలకుల పౌడర్, 1/4 టీస్పూన్ సాఫ్రాన్

పాలని బాగా మరగబెట్టండి. చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి.

స్టవ్ మీద నుంచి దించేసి..షుగర్, యాలకల పౌడర్, సాఫ్రాన్, క్రీమ్ అన్నీ వేసి కూల్ అయ్యేంత వరకు కలపండి.

ఈ మిక్స్ క్రీమ్ మొత్తాన్ని కుల్ఫీ పాత్రల్లో వేసి ఫ్రీజర్ లో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పెట్టండి.

ఫ్రీజర్ నుంచి తీశాక.. వేడి నేటిలో కుల్ఫీ పాత్రలను ముంచి ఐస్ క్రీమ్ వేరు చేసేయండి.

కుల్ఫీ మీద పిస్తా, బాదం ఫ్లేక్స్ తో టాపింగ్ చేసి తినండి, పిల్లలకు తినిపించండి.