ఈ సూపర్‌ఫుడ్స్ తింటే ఈజీగా బరువు తగ్గవచ్చు

కాలె.. ఈ ఆకుకూరలో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఫుల్. జీర్ణశక్తిని పెంచి వెయిట్ లాస్‌కు తోడ్పడుతుంది.

బెర్రీ ఫ్రూట్స్.. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువ, క్యాలరీలు తక్కువ పైగా శరీరానికి ఎంతో ఆరోగ్యకరం.

బ్రొక్కోలీ.. పుష్కలంగా ఫైబర్ ఉన్న ఈ వెజ్జీలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువ.

చియా సీడ్స్.. ప్రొటీన్, ఫైబర్ శాతాలు ఇందులో ఎక్కువ. పైగా కడుపులో ఇవి ఊబిపోయి ఆకలిని తగ్గిస్తాయి.

కోడి గుడ్లు.. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నా గుడ్లు ఆకలిని తగ్గిస్తాయి.

అవకాడో.. ఇందులో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్ ఉంటాయి. అందుకే గుండె ఆరోగ్యంతో పాటు బరువు తగ్గించడానికీ తోడ్పడతాయి.

స్వీట్ పొటాటో.. ఇది డెన్స్ సూపర్ ఫుడ్. స్లోగా డైజెషన్ అవుతుంది. కానీ ఫ్యాట్ లాస్‌కు తోడ్పడుతుంది.