ప్రతిరోజూ భోజనంలో పెరుగు లేనిదే చాలామందికి భోజనం చేసిన ఫీలింగ్ రాదు

రోజుకో కప్పు పెరుగు తింటే చాలా వ్యాధులు రావని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధశక్తి బలంగా ఉండాలి.

ఇందులోని ప్రోబయోటిక్స్ శరీరంలోని రోగ నిరోధక ప్రతిస్పందనను, యాంటీబాడీల ఉత్పత్తిని పెంచుతాయి.

పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది.

కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటివి రాకుండా ఉంటాయి.

రోజూ పెరుగు తినేవారిలో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి వ్యాధులొచ్చే అవకాశాలు తగ్గుతాయి.

అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి రాకుండా అడ్డుకునే శక్తి పెరుగుకి ఉంది.

పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.

ఆస్టియోపోరోసిస్ వంటి కీలకవ్యాధులు రాకుండా ఉంటాయి.

పెద్దపేగు క్యాన్సర్ బారిన పడకుండా పెరుగు కాపాడుతుంది. పెద్దపేగులో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ పెరుగు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి.

ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

అంతేకాదు ఊబకాయం రాకుండా కూడా ఉంటుంది. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగును మీ ఆహారంలో చేర్చుకోండి.