వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చల్లగా ఐస్ క్రీమ్ తినడం కామన్.

వర్షం పడేటపుడు, మంచు కురిసేటపుడు కూడా ఐస్ క్రీమ్ తినడం స్పెషల్ అనుకుంటారు

ముఖ్యంగా రాత్రివేళ, అర్థరాత్రివేళల్లో ఐస్ క్రీమ్ లు తినడం రొమాంటిక్ గా ఫీలవుతుంటారు కొంతమంది.

కానీ.. అది ఆరోగ్యానికి అంతమంచిది కాదంటున్నారు డైటీషియన్లు. చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయ్.

భోజనం తర్వాత ఐస్ క్రీమ్ తింటే బ్లడ్ లో షుగర్ పెరుగుతుంది. హార్మన్ల నియంత్రణ సామర్థ్యం దెబ్బతింటుంది.

ఐస్ క్రీమ్ లో కేలరీలు అధికం. కాబట్టి బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

నిద్రకు ముందు ఐస్ క్రీమ్ తింటే.. అధిక కేలరీల కారణంగా ఉబ్బరం, గ్యాస్, అజీర్ణ సమస్యలు రావొచ్చు.

అర్థరాత్రుళ్లు ఐస్ క్రీమ్ సహా.. ఇతర స్నాక్స్ తినడం మానుకోవాలి.

అంతగా తినాలనిపిస్తే నట్స్, ఫ్రూట్స్, ప్రొటీన్ లేదా ఫైబర్ సోర్స్ ఉన్న ఐస్ క్రీమ్ లను తినండి