వీరు పనస తొనలు తిన్నారంటే.. బెడ్ ఎక్కాల్సిందే..

వేసవిలో ఎక్కువగా పనసకాయలు దొరుకుతుంటాయి. పనస తొనల్ని చాలా మంది ఇష్టంగా తింటుంటారు.

పనస తొనలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పనస తొనలు అస్సలు తినకూడదని నిపుణలు చెబుతున్నారు.

దీనిలో విటమిన్ ఎ, సి, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

డయాబెటిస్ ఉన్నవారు పనస తొనలను తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 కిడ్నీ సమస్యలున్న వారు తింటే రక్తంలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. దీంతో ఆరోగ్యానికి చాలా హానికరం.

అలాగే ఇది గుండెపోటు, పక్షవాతానికి కారణమవుతుంది.

అలెర్జీ ఉన్నవారు పనస అస్సలు తినకూడదని చెబుతున్నారు.

శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు లేదా ఏదైనా శస్త్రచికిత్సకు ముందు పనస పండు తినకూడదని ఆయుర్వేద నిపుణలు అంటున్నారు.

ప్రెగ్నెన్సీ సమయంలో పనస పండు తింటే తల్లికి, గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఇద్దరికీ హానికరం.