బెల్లం మంచిదని తింటున్నారా? అయ్య బాబోయ్..

ఆరోగ్యానికి చక్కెర కంటే బెల్లం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

ఇందులో ఉండే అధిక కార్బోహైడ్రేట్ వల్ల శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది.

శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి రక్తాన్ని శుద్ది చేస్తుంది.

దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలకు చక్కని నివారిణిగా ఈ బెల్లం ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా అనీమియాతో బాధపడుతున్న రోగులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

ఎర్రరక్తకణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.

బరువు తగ్గాలనుకునేవారికి ఈ బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది.

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటుంది.

అంతేకాకుండా బెల్లం కాలేయం పని తీరును కూడా మెరుగుపరుస్తుంది