నిద్రపోతున్నప్పుడు గురక రావడం సహజం. కానీ రోజూ గురక పెడుతూ, శ్వాస కోసం ముక్కును గట్టిగా ఊదుతూ ఉంటే అది ప్రాణాంతకర వ్యాధికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గురక కారణంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అందులో ముఖ్యమైంది హైపర్ టెన్షన్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్

రాత్రిపూట ఎక్కువసేపు గురక పెట్టే వారికి హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య 83% మంది పురుషులు మరియు 71% మంది స్త్రీలలో సర్వసాధారణం.

తేలికపాటి లేదా అప్పుడప్పుడు వచ్చే గురక సాధారణమే. అయినప్పటికీ, దీర్ఘకాలికంగా వచ్చే గురక కారణంగా స్ట్రోక్, గుండెపోటు వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది.

నిద్ర లేకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో ముందుగా ఆరోగ్యం క్షీణిస్తుంది. మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు మొదలవుతాయి. ఈ సమస్య పెరుగుతూనే ఉంటుంది. చివరకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అందువల్ల దీనికి చికిత్స తీసుకోవడం మంచిది.