అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలోనే కాదు.. చర్మంపై ముడతల్నీ తొలగిస్తాయి.

అవిశగింజల జెల్.. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ముడతలు, సన్నని గీతలు రాకుండా నిరోధిస్తుంది.

2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు.. ఒక గ్లాసులో నీటిలో వేసి సన్నని మంటపై ఉడికించాలి.

స్పూన్ తో తిప్పుతూ.. అది పొంగు వచ్చేంత వరకూ ఉంచి.. స్టవ్ ఆఫ్ చేయాలి.

గోరువెచ్చగా అయ్యాక గింజల్ని వడకట్టుకోవాలి. దానిని పూర్తిగా చల్లారనిస్తే జెల్ గా మారుతుంది.

ఆ జెల్ ను ముఖానికి చేతులకు రాసి.. ఆరిపోయాక కడిగేసుకోవాలి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.

పొడి చర్మం ఉన్నవారికి ఈ జెల్ మంచి ఔషధంలా పనిచేస్తుంది.

కళ్లకింద డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.