ఈ కామర్స్ సంస్థలు వరుసగా ఆఫర్లు కురిపిస్తున్నాయి. ఆపిల్ సిరీస్ ఫోన్లపై వరుసబెట్టి డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డీల్ ప్రకటించింది.

దీంతో పెద్ద డిస్‌ప్లేతో ఉన్న ఫోన్ చౌకగా మారింది. ఐఫోన్ కొనాలనుకుంటే ఈ డీల్ చాలా ఉపయోగంగా ఉంటుంది.

ప్రస్తుతం దాని అసలు ధర కంటే రూ. 24,000 చౌకగా అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ బచాట్ డేస్ సేల్‌లో iPhone 14 ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79,900గా ఉంది.

అయితే ఇప్పుడు దీనిపై 29 శాతం డిస్కౌంట్ ఇస్తోంది.

దీంతో ఫోన్‌‌పై రూ. 23,901 తగ్గింపు లభిస్తుంది.

అంటే ఫోన్‌ను ఇప్పుడు రూ.55,999కి కొనుగోలు చేయవచ్చు.

ఫోన్ అన్ని కలర్ వేరియంట్‌లు ఈ ధరలో అందుబాటులో ఉన్నాయి.

మీరు బ్యాంక్ ఆఫర్‌లను ఉపయోగించుకోవడం వల్ల దీని ధర మరింత తగ్గుతుంది.