టెక్ ప్రపంచంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌పై పెద్ద యుద్ధమే జరుగుతుంది.

ఈ సెగ్మెంట్‌లో తమ అధిపత్యాన్ని చెలాయించడానికి అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి.

వరుసగా స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

ఇప్పుడు ఈ జాబితాలో మోటో కూడా చేరింది.

మోటో తన G సిరీస్ ఫోన్‌పై మంచి డీల్ తీసుకొచ్చింది.

ఫ్లిప్‌కార్ట్ మోటరోలా G సిరీస్ Motorola G64 5G పవర్‌‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ బంపర్ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.14,999.

వెయ్యి రూపాయల తగ్గింపుతో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఈ తగ్గింపు కోసం మీరు Axis లేదా HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ.9,200 తగ్గించవచ్చు.