ఫ్రిజ్ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ముఖ్యమైన అవసరంగా మారింది.
మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు వివిధ రకాల ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఫ్రిజ్ వాడుతుంటాము.
సమయం లేనప్పుడు కొన్ని రకాల టిప్స్ పాటించడం ద్వారా ఈజీగా ఫ్రిజ్ క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిజ్‌ను శుభ్రం చేయడానికి కొన్ని టిప్స్
ముందుగా, రిఫ్రిజిరేటర్ నుండి అన్ని వస్తువులను తీయండి. చెడిపోయిన ఆహారాన్ని బయటపడేయండి.
ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని, దానిలో బేకింగ్ సోడా వేసి లిక్విడ్ తయారు చేయండి.
ఈ ద్రావణం సహాయంతో ఫ్రిజ్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు.
ఈ లిక్విడ్ సహాయంతో, ఫ్రిజ్ లోపల ఉన్న అన్ని భాగాలను పూర్తిగా శుభ్రం చేయండి.
స్పాంజ్ చేరుకోలేని ఫ్రిజ్ మూలలను శుభ్రం చేయడానికి బ్రష్ లను ఉపయోగించండి.
ఏవైనా మొండి మరకలు ఉంటే వాటిని తొలగించడానికి వెనిగర్ ఉపయోగించండి
దీన్ని స్ప్రే బాటిల్‌లో నింపి మరకపై స్ప్రే చేసి 5 నిమిషాల తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడవండి.
వీటి ద్వారా దాదాపు ఫ్రిజ్ లో ఉన్న అన్ని మరకలు పోతాయి.