వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తినండి
వర్షాకాలం చిటపట చినుకులతోపాటు వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలనూ వెంట తెస్తుంది.
ఈ కాలంలో ఇమ్యూనిటీ పెంచే పండ్లు తినడం మంచిది.
నేరేడు పండులో ఐరన్, కాల్షియం, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఈ పండ్లు వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తాయి.
రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది.
యాపిల్‌లో ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, బీటా కెరోటిన్, విటమిన్ కెలు మెండుగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే దానిమ్మ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
గట్ హెల్త్‌ను కూడా మెరుగుపరుస్తుంది.
విటమిన్ బీ6 సమృద్ధిగా ఉండే అరటి పండు కూడా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
పియర్ పండులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పియర్‌లో విటమిన్ సీ, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్, పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.