ప్రొటీన్ కోసం ఈ ఫ్రూట్స్‌ తినండి..

సాధారణంగా పండ్లలో ప్రొటీన్ ఉండదు. కానీ కొన్ని పండ్లలో తక్కువ మోతాదులో ఉంటుంది.

జామకాయ.. ఇందులో ప్రతి 100 గ్రాములకు 4.2 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. రోధనిరోధక శక్తిని పెంచుతుంది.

పనసపండు.. ఇందులోని 2.8 గ్రాముల ప్రొటీన్, విటమిన్ బి6 కండారలు, మెదడు ఆరోగ్యానికి మంచిది.

కివి.. ఈ పండులో 2.1 గ్రాముల ప్రొటీన్, విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.

దానిమ్మ.. ఈ పండులో 1.5 గ్రాముల ప్రొటీన్ తో మంచి యాంటిఆక్సిడెంట్స్ ఉండడంతో రోధనిరోధక శక్తి పెంచుతుంది.

అరటిపండులో 1.3 గ్రాముల ప్రొటీన్, పోటాషియం, మెగ్నీషియం కండరాల ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.

చెర్రీస్, పీచస్ పళ్లలో 1 గ్రాము ప్రొటీన్ ఉంటుంది. ఇవి తింటే చర్మం, నిద్ర లేమి సమస్యలకు మంచిది.