బరువైన స్కూల్ బ్యాగులతో పిల్లల ఆరోగ్యానికి ముప్పు
రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే బ్యాగులు బరువుగా ఉండడం వల్ల చిన్నపిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
అధిక బరువు ఉన్న స్కూల్ బ్యాగ్స్ పిల్లల్లో వీపునొప్పి, అలసట, శరీరంపై ఒత్తిడి సమస్యలు తలెత్తుతున్నాయి.
బ్యాగ్స్ బరువు కారణంగా పిల్లల వంగుతూ నడవడం అలవాటుపడతారు.
వంగిపోయి నడవడం వల్ల పిల్లల్లో స్కోలియోసిస్, కిఫోసిస్ లాంటి వెనెముక సమస్యలు వచ్చే ప్రమాదముంది.
బ్యాగ్ బరువుగా ఉండడం వల్ల పిల్లల్లో శ్వాస సమస్యలు, స్టామినా తగ్గుదల, విపరీతమైన అలసట కలిగే అవకాశముంది.
బరువైన బ్యాగ్ మోయడం వల్ల భుజాలు, మెడ కండాలపై ఒత్తిడి కలిగి తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది.
బరువు మోసి అలసిపోవడం, ఒత్తిడికి గురికావడంతో స్కూల్‌లో చదువుపై ధ్యాస పెట్టడం సమస్యగా మారుతుంది.