శ్రీదేవి వారసురాలిగా పరిచయమయ్యింది జాన్వీ కపూర్. తన చెల్లెలు ఖుషి మాత్రం హీరోయిన్‌గా అడుగుపెట్టకముందే సోషల్ మీడియాను ఏలేస్తోంది.
ఇప్పటివరకు ఖుషి కపూర్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయినా తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.
రెండు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన తర్వాత ఖుషికి ‘ది ఆర్చీస్’ అనే వెబ్ ఫిల్మ్‌లో నటించే ఛాన్స్ లభించింది. కానీ అదే తనకు మైనస్ అయ్యింది.
‘ది ఆర్చీస్’లో బెట్టీ కపూర్ అనే పాత్రలో నటించింది ఖుషి కపూర్. కానీ అందులో తన యాక్టింగ్‌పై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
సినిమాల్లో యాక్టింగ్ ఎలా ఉన్నా ఖుషి కపూర్ ఫ్యాన్స్ సెన్స్‌కు మాత్రం ఫ్యాన్స్ ఉన్నారు.
హీరోయిన్ అవ్వకపోయినా బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్‌తో కలిసి పనిచేసింది ఖుషి కపూర్.
మోడర్న్ అయినా, ట్రెడీషినల్ అయినా తనకు సూట్ అయ్యే దుస్తులు వేసుకుంటూ యూత్‌ను ఇన్‌స్పైర్ చేస్తుంది.
స్టైలింగ్ విషయంలో జాన్వీ కపూర్‌ను మించిపోయిందని ఖుషి కపూర్ గురించి నెటిజన్లు అనుకుంటూ ఉంటారు.
2000 నవంబర్ 5న జన్మించిన ఖుషి కపూర్.. ఈ ఏడాది తన 24వ ఏట అడుగుపెడుతుంది.
ఈసారి తన పుట్టినరోజును ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పాటు బాయ్‌ఫ్రెండ్ వేదాంగ్ రైనాతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది ఖుషి కపూర్.