ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఫార్మ్‌లో ఉన్న హీరోయిన్స్ కంటే ఒక సీనియర్ హీరోయిన్ ఆస్తుల విలువ తెలిస్తే మతిపోవాల్సిందే. తనే జూహీ చావ్లా.

హురూన్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం జూహీ ఆస్తుల విలువ రూ.4,600 కోట్లు. ఎన్నో బిజినెస్‌లలో పెట్టుబడుల వల్ల తను ఇంత రిచ్ అయ్యిందని సమాచారం.

1980, 1990ల్లో హీరోయిన్‌గా జూహీ చావ్లాకు అమితమైన క్రేజ్ లభించింది. 2000 తర్వాత తను సినిమాల్లో కనిపించడం తగ్గిపోయింది.

షారుఖ్ ఖాన్ స్థాపించిన రెడ్ చిల్లీస్ గ్రూప్, ఐపీఎల్‌లో కేకేఆర్ టీమ్‌కు జూహీ చావ్లా కో ఫౌండర్‌గా వ్యవహరిస్తోంది.

జూహీ చావ్లాకు చిన్నప్పటి నుండి రిచ్, ఫేమస్ అవ్వాలనే కోరిక ఉండేది. ఫైనల్‌గా తన కల నేరవేర్చుకొని చాలామందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది.

జూహీ చావ్లా చిన్నప్పుడు సరదాగా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విన్నర్ అవ్వడంతో తనే కాదు తన పేరెంట్స్ కూడా షాకయ్యారు.

జూహీ చావ్లాకు ప్రొడక్షన్‌లో కొంచెం కూడా అవగాహన లేకపోయినా తన స్నేహితుడు షారుఖ్ కోసం ఆ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది.

తన భర్త జై మెహ్తా స్థాపించిన సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్ కంపెనీలో కూడా జూహీ చావ్లా షేర్ హోల్డర్‌గా ఉన్నారు.

ముంబాయ్‌లో జూహీ చావ్లా, జై మెహ్తాకు రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయని సమాచారం.

జూహీ చావ్లాకు ఎన్నో లగ్జరీ కార్లు ఉండడంతో పాటు ఇప్పటికీ ఎన్నో బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా కూడా పనిచేస్తున్నారు.