నవంబర్ 23న అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలపై ఓ లుక్కేయండి.
అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన ‘మనం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
నాగచైతన్య, సమంత కలిసి నటించిన ‘మజిలీ’కి ప్రపంచవ్యాప్తంగా రూ.67 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
వెంకటేశ్, చైతూ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ‘వెంకీ మామ’ ఫ్లాప్ టాక్ అందుకున్నా కూడా రూ.66 కోట్ల కలెక్షన్స్ రాబట్టగలిగింది.
నాగార్జున, నాగచైతన్య మల్టీ స్టారర్ సినిమా ‘బంగార్రాజు’ కలెక్షన్స్ రూ.65 కోట్లు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ రూ.63 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది.
ఫ్యామిలీ డ్రామాతో పాటు లవ్ స్టోరీగా అలరించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’కు రూ.50 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
చైతూను లవర్ బాయ్‌గా మార్చిన ‘100% లవ్’ సినిమా అప్పట్లోనే రూ.40 కోట్లను కలెక్ట్ చేసింది.
సునీల్‌తో కలిసి చైతూ నటించిన ‘తడాఖా’ రూ.39 కోట్ల కలెక్షన్స్‌తో పరవాలేదనిపించింది.
చైతూ కెరీర్‌లో గుర్తుండిపోయే ప్రేమకథల్లో ఒకటి అయిన ‘ప్రేమమ్’ రూ.37 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించింది.