కంగనా నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘ఎమర్జెన్సీ’ ఎన్నో అడ్డంకులు దాటుకొని జనవరి 17న విడుదలయ్యింది.

ఇందిరా గాంధీ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ప్లస్, మైనస్‌లపై ఓ లుక్కేయండి.

Emergency

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ యాక్టింగ్.. మూవీకి పెద్ద ప్లస్‌గా మారింది.

బయోపిక్ ప్లస్ థ్రిల్లర్‌గా మూవీని డైరెక్ట్ చేయడంలో కంగనా చాలావరకు సక్సెస్ అయ్యింది.

కీలక పాత్రల్లో నటించిన సీనియర్ ఆర్టిస్టులు కూడా సినిమాకు ప్లస్ అయ్యారు.

హిస్టరీలో చాలావరకు ముఖ్యమైన అంశాలను మిస్ అవ్వకుండా ఈ సినిమాలో కవర్ చేశారు.

ఈసారి నటిగా మాత్రమే కాదు.. డైరెక్టర్‌గా కూడా కంగనాకు నేషనల్ అవార్డ్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్.

మైనస్‌ల విషయానికొస్తే.. హిస్టరీలో కొన్ని అంశాలను తమకు తగినట్టుగా మార్చుకున్నారని కొందరు ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి ఒక రాజకీయ సబ్జెక్ట్‌ను మరింత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిందని అంటున్నారు.

ఎన్నో అంశాలను చూపించాలనే ఉద్దేశ్యంతో పలు చోట్ల సినిమా వేగంగా సాగిపోయినట్టు అనిపిస్తుంది.