తను నటించిన సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా తన గ్లామర్, పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది నభా నటేశ్.
డిసెంబర్ 11న నభా నటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా తనకు విషెస్ చెప్తూ తను ఎదుర్కున్న కష్టాల గురించి గుర్తుచేసుకుంటున్నారు.
మాతృభాష అయిన కన్నడలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నభా నటేశ్. రెండేళ్ల తర్వాత తనకు తెలుగులో ఛాన్సులు వచ్చాయి.
సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో నభా నటేశ్ టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’తో నభా కెరీరే టర్న్ అయిపోయింది.
తెలుగులో అవకాశాలే బాగానే వస్తున్న సమయంలో నభా నటేశ్‌కు ఒక యాక్సిడెంట్ అయ్యింది.
నభాకు యాక్సిడెంట్ అయిన విషయం చాలామంది తెలియదు. సినిమాల్లో గ్యాప్ వచ్చేసరికి చాలామంది తనను మర్చిపోయారు కూడా.
ఈ ఏడాది ప్రియదర్శి హీరోగా నటించిన ‘డార్లింగ్’ అనే మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది నభా నటేశ్.
నభా నటేశ్ కమ్ బ్యాక్ టాలీవుడ్‌లో అంతగా వర్కవుట్ అవ్వలేదు. అయినా ఇప్పటికీ తన చేతిలో అవకాశాలు బాగానే ఉన్నాయి.
‘స్వయంభు’, ‘నాగబంధనం’ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌పైనే నభా నటేశ్ ఆశలు పెట్టుకుంది.