మెగా ఫ్యామిలీ నుండి అందరూ హీరోలే వస్తున్న సమయంలో మెగా ప్రిన్సెస్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక కొణిదెల.

నాగబాబు వారసురాలు అయిన నిహారిక.. ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెండితెరపైకి వచ్చింది.

డిసెంబర్ 18న నిహారిక పుట్టినరోజు కావడంతో విష్ చేస్తూ తన లైఫ్‌లోని కాంట్రవర్సీల గురించి గుర్తుచేసుకుంటున్నారు నెటిజన్లు.

మెగా ఫ్యామిలీ నుండి వచ్చి మెగా ప్రిన్సెస్‌గా మారిన నిహారిక పర్సనల్ లైఫ్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచింది.

నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో నాగశౌర్యతో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి.

ఎవరూ ఊహించని విధంగా సినిమాలతో సంబంధం లేని చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది నిహారిక.

ఏమైందో కారణం తెలియదు కానీ పెళ్లయిన ఏడాదిలోనే చైతన్యతో విడాకులు తీసుకుంది.

విడాకుల తర్వాత నిహారిక బోల్డ్ ఫోటోలు, స్టేట్‌మెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో రచ్చ చేశాయి.

ఇప్పటికీ నిహారిక ఎప్పుడు ఏం మాట్లాడినా వెంటనే వైరల్ అయిపోతుంటాయి.

తాజాగా ‘మద్రాస్‌కారన్’ అనే మూవీలో హీరోతో ఘాటు రొమాన్స్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది నిహారిక.