ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్ల లిస్ట్‌లో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కూడా ఉంటారు.

2015లో విడులదయిన ‘మలుపు’ అనే సినిమాలో మొదటిసారి ఆది, నిక్కీ కలిసి నటించారు.

‘మలుపు’ను ఆది అన్న సత్య ప్రభాస్ డైరెక్ట్ చేయగా ఆ మూవీ సెట్‌లోనే వీరు మొదటిసారి కలుసుకున్నారు.

సినిమా షూటింగ్ సమయంలో ఆది, నిక్కీ మధ్య మంచి స్నేహం కుదిరింది.

ఆ మూవీ విడుదలయిన రెండేళ్ల తర్వాత మళ్లీ వారికి కలిసి నటించే ఛాన్స్ లభించింది.

‘మరకతమణి’ అనే సినిమాలో ఆది, నిక్కీ మరోసారి కలిసి నటించి అలరించారు.

అదే సమయానికి ఆది, నిక్కీ ప్రేమలో పడ్డారు. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

2022 మార్చి 24న సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చారు.

2022 మే 18న ఆది, నిక్కీ పెళ్లితో ఒక్కటయ్యారు.

ఆది, నిక్కీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు చూసి వీరు చాలా అండర్ రేటెడ్ కపుల్ అని ప్రేక్షకులు భావిస్తుంటారు.