బాలీవుడ్‌లో కింగ్ ఖాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్‌కు 59 ఏళ్ల వయసు అంటే నమ్మడం కష్టమే.
నవంబర్ 2న తన 59వ ఏట అడుగుపెట్టారు షారుఖ్. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్, సెలబ్రిటీస్ ఆయనకు విషెస్ చెప్తున్నారు.
ఎన్నో ఏళ్లు ఫ్లాపులు వచ్చినా వాటిని ఎదిరించి నిలబడి మళ్లీ వరుసగా తన సినిమాలతో రూ.1000 కోట్లు కొల్లగొట్టే సత్తా షారుఖ్‌కు ఉంది.
59 ఏళ్లు వచ్చినా షారుఖ్ ఖాన్ లాగా ఫిట్‌గా ఉండాలంటే ఈ కింగ్ ఖాన్ షేర్ చేసుకున్న ఫిట్‌నెస్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.
ఎప్పుడూ బిజీగా ఉంటే షారుఖ్.. ఉదయం 5 గంటలకు నిద్రపోయి 9 గంటలకు లేస్తారట. అయినా ఎనర్జీతో ఉండడానికి ఆయన డైటే కారణం.
అర్థరాత్రి 2 గంటలకు అరగంట పాటు వర్కవుట్స్ చేస్తారట షారుఖ్ ఖాన్. అంతే కాకుండా రోజుకు ఒక మీల్ మాత్రమే తింటారట.
షారుఖ్ డైట్‌లో మాంసం, పప్పులు, ఎగ్ వైట్స్, గ్రిల్ చికెన్ తప్పకుండా ఉంటాయని ఆయనే బయటపెట్టారు.
ఎక్కువగా ఇంటి భోజనం తినడానికే ఇష్టపడతారు షారుఖ్. అందుకే సెట్స్‌కు కూడా ఇంటి నుండి బాక్స్ తెచ్చుకుంటారు.
తందూరి చికెన్ అంటే షారుఖ్‌కు చాలా ఇష్టం. జీవితాంతం అదే తిన్నమన్నా తింటానని ఆయన చాలాసార్లు చెప్పారు.
షారుఖ్ ఖాన్ జంక్ ఫుడ్, స్వీట్స్‌కు దూరంగా ఉంటారు. తన భార్య గౌరీ ఖాన్ ఇంట్లో చేసే ఐస్ క్రీమ్ అంటేనే తనకు చాలా ఇష్టం.