ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి కనుమరుగు అయిపోయిన హీరోయిన్స్‌లో శాన్వీ శ్రీవాస్తవ కూడా ఒకరు.

ఆదితో కలిసి నటించిన ‘లవ్లీ’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది శాన్వీ.

ఆ తర్వాత ఒకట్రెండు తెలుగు చిత్రాల తర్వాత కన్నడలో శాన్వీకి ఛాన్స్ లభించింది.

కన్నడలో అడుగుపెట్టిన తర్వాత శాన్వీ శ్రీవాస్తవ రేంజే మారిపోయింది.

శాండిల్‌వుడ్‌లో శాన్వీకి హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా అవకాశాలు మాత్రం తగ్గలేదు.

దాదాపు అయిదేళ్ల పాటు శాన్వీ శ్రీవాస్తవకు శాండిల్‌వుడ్‌లో బ్రేకుల్లేవు.

ప్రస్తుతం టాలీవుడ్ శాన్వీని మర్చిపోయిన శాండిల్‌వుడ్‌లో మాత్రం తన జోరు తగ్గలేదు.

త్వరలోనే మరాఠీ ఇండస్ట్రీలో కూడా శాన్వీ అడుగుపడనుంది. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న ‘రాంతి’ త్వరలో విడుదల కానుంది.

డిసెంబర్ 8న శాన్వీ శ్రీవాస్తవ పుట్టినరోజు కావడంతో తన ఫ్యాన్స్ అంతా విషెస్ చెప్తున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పటికీ తన ఫోటోషూట్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ వారణాసి భామ.