సిద్ధార్థ్ మల్హోత్రా జనవరి 16న తన 40వ ఏట అడుగుపెడుతుండగా కియారాతో తన లవ్ స్టోరీ గురించి ప్రేక్షకులు మరోసారి చర్చించుకుంటున్నారు.
సిద్ధార్థ్, కియారా 2020లో విడుదలయిన ‘షేర్షా’ మూవీలో కలిసి నటించారు. అక్కడే వారి ప్రేమ మొదలయ్యింది.
‘షేర్షా’ తర్వాత సిద్ధార్థ్, కియారా ఒక హాలిడే కోసం మాల్దీవ్స్ వెళ్లడంతో వీరి ప్రేమ గురించి బయటపడింది.
ప్రేమ గురించి బయటపడినా కూడా వీరు మాత్రం దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు.
‘కాఫీ విత్ కరణ్’ షోలో సిద్ధార్థ్, కియారా వేర్వేరుగా పాల్గొన్నప్పుడు తమ ప్రేమ గురించి దాదాపుగా ఒప్పేసుకున్నారు.
మధ్యలో సిద్ధార్థ్, కియారాకు బ్రేకప్ అయ్యిందని కూడా బాలీవుడ్ సర్కిల్లో వార్తలు వైరల్ అయ్యాయి.
బ్రేకప్ రూమర్స్ నిజమే అన్నట్టుగా సిద్ధార్థ్, కియారా కూడా ఎవరికి వారే అన్నట్టుగా ఉండడం మొదలుపెట్టారు.
బ్రేకప్ సమయంలో సిద్ధార్థ్, కియారా మళ్లీ ఓ పార్టీలో కలవగా అక్కడే మళ్లీ ప్యాచప్ కూడా అయిపోయారు.
ఎవరికీ తెలియకుండా రాజస్థాన్‌లో తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకున్నారు సిద్ధార్థ్, కియారా.
ఇప్పటికే సిద్ధార్థ్, కియారా వెడ్డింగ్ వీడియో బాలీవుడ్ సెలబ్రిటీ వెడ్డింగ్స్‌లో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయింది.