1989 డిసెంబర్ 21న పుట్టిన తమన్నా.. తన 35వ ఏట అడుగుపెడుతుండడంతో తన గురించి ఈ ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేయండి.

13వ ఏళ్ల వయసులోనే తమన్నా యాక్టింగ్ మొదలుపెట్టింది. ఏడాది పాటు పృథ్వి థియేటర్‌లో ట్రైనింగ్ తీసుకొని పర్ఫార్మెన్స్‌లు ఇచ్చింది.

హీరోయిన్‌గా అడుగుపెట్టే ముందు 2005లో విడుదలయిన ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించింది తమన్నా.

2007లో తమన్నా కెరీర్ మలుపు తిరిగింది. తెలుగులో ‘హ్యాపీ డేస్’తో, తమిళంలో ‘కళ్లూరి’తో బ్రేక్ అందుకుంది.

2021లోనే ఓటీటీ ప్రపంచంలో అడుగుపెట్టింది తమన్నా. తన మొదటి వెబ్ సిరీస్ ‘11త్ హవర్’.

ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 85 సినిమాల్లో నటించింది తమన్నా.

న్యూమరాలజీని బాగా నమ్మే తమన్నా తన పేరులోని స్పెల్లింగ్స్‌ను కూడా మార్చేసుకుంది.

తమన్నాకు వైట్ ఎన్ గోల్డ్ అనే జ్యువలరీ బిజినెస్ కూడా ఉంది. తను ఆ బ్రాండ్‌కు క్రియేటివ్ హెడ్ కూడా.

‘లస్ట్ స్టోరీస్ 2’ అనే వెబ్ ఫిల్మ్ షూటింగ్ సమయంలో విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడింది తమన్నా.

తమన్నా ఆస్తుల విలువ ప్రస్తుతం దాదాపు రూ.130 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.