రామ్ చరణ్ హీరోగా పరిచయమయిన ‘చిరుత’ సినిమాతో నేహా శర్మ హీరోయిన్‌గా పరిచయమయ్యింది.
నేహా శర్మ 1987 నవంబర్ 21న జన్మించింది. తన 37వ పుట్టినరోజు సందర్భంగా ఈ బోల్డ్ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలపై లుక్కేయండి.
నేహా శర్మ కథక్ డ్యాన్సర్‌గా ట్రైనింగ్ తీసుకుంది. హిప్ హాప్ డ్యాన్స్‌లో కూడా తనకు పట్టు ఉంది.
నేహాకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే కోరిక ఉండేది. అందుకే పలుమార్లు తన డ్రెస్సులను తానే డిజైన్ చేసుకొని ఆకట్టుకుంది.
నేహా శర్మ ఒక పెట్ లవర్. తను ఎన్నో రకాల పెట్స్‌ను దత్తత తీసుకొని, వాటికి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చింది.
చాలామంది హీరోయిన్లు ఫిట్‌గా ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి వారిలో నేహా శర్మ కూడా ఒకరు.
సినిమాలు, కెరీర్‌తో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా నేహా శర్మ యాక్టివ్‌గా ఉంటుంది.
నేహా శర్మకు దైవభక్తి ఎక్కువ. అందుకే దాని గురించి ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటుంది.
‘చిరుత’ తర్వాత ‘కుర్రాడు’ అనే తెలుగు మూవీలో నటించింది నేహా. ఆ తర్వాత తెలుగు తెరపై నుండి కనుమరుగు అయిపోయింది.
నేహా శర్మ ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించినా.. 2016లో ఒక చైనీస్ సినిమాలో కూడా నటించే అవకాశం కొట్టేసింది.