బాలీవుడ్లో మాత్రమే కాదు.. టాలీవుడ్లో కూడా హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో టబు ఒకరు.
టబు.. 1971 నవంబర్ 4న జన్మించారు. ఇప్పుడు ఆమె వయసు 53 ఏళ్లు. కానీ ఆమె ఇన్‌స్టా పోస్టులు చూస్తుంటే 53 ఏళ్లంటే నమ్మడం కష్టమే అనిపిస్తుంది.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే టబు హైదరాబాదీ అమ్మాయే. కానీ తను పెరిగిందంతా ముంబాయ్‌లోనే.
టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. తనకు ప్రేమ, పెళ్లి మీద పెద్దగా ఆసక్తి లేదని ఇప్పటికే ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చింది.
బాలీవుడ్లో మాత్రమే కాదు హాలీవుడ్లో కూడా టబు అడుగుపడింది. త్వరలోనే ‘డ్యూన్ ఫ్రొఫెసీ’తో ప్రేక్షకులను పలకరించనుంది.
ఇప్పటికీ టబు స్టైలింగ్ చూస్తుంటే చాలామందికి తనలాగా రెడీ అవ్వాలని అనిపిస్తుంటుంది. తను క్రియేట్ చేసిన మార్క్ అలాంటిది.
నాగార్జున, అజయ్ దేవగన్ లాంటి హీరోలను ప్రేమించి లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లే టబు ఇంకా పెళ్లి చేసుకోలేదని రూమర్స్ ఉన్నాయి.
ఇప్పటికే చేతి నిండా ఆఫర్లతో బాలీవుడ్లో దూసుకుపోతోంది టబు. ఇటీవల ‘ఔరోన్ మే కహా ధమ్ థా’, ‘క్రూ’ సినిమాల్లో లీడ్‌గా నటించింది.
చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురం’ సినిమాతో టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
టబు పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తనకు విషెస్ తెలిపారు.