స్టార్ ఆపిల్‌తో లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
స్టార్ ఆపిల్‌ను కైనిటో ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.
దీని బెరడు, ఆకులు, పండ్ల గుజ్జు సాంప్రదాయ వైద్యంలో అనేక వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడతాయి.
లారింగైటిస్, న్యుమోనియా వంటి శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.
విరేచనాలు, కడుపు పూత, వాపులకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు
రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.
విటమిన్ C,కాల్షియం, ఫాస్పరస్, యాంటీఆక్సిడెంట్లతో సహా అనేక పోషకాలను కలిగి ఉంటుంది.
కణాల ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ పండు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడంలో సహాయపడుతుంది.