రోజూ కాలీఫ్లవర్ తింటే ఏమవుతుందో తెలుసా?
కాలీఫ్లవర్‌లో ఉన్న విటమిన్–C,యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి.
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
కాలీఫ్లవర్‌లోని పాలీఫినాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.
కాలిఫ్లవర్‌లో ఉండే కోలిన్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
విటమిన్–K,కాల్షియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఎముకలను బలోపేతం చేస్తాయి.
యాంటీ–ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వచ్చే వాపులు, నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఆప్షన్.
విటమిన్–C, యాంటీఆక్సిడెంట్లు చర్మపు కణాలను పునరుద్ధరిస్తాయి.
కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.