30 నిమిషాలు ప్రతిరోజు వాకింగ్ చేస్తే ఈ ఆరోగ్య లాభాలు సొంతం..

వాకింగ్ చాలా సింపుల్ వ్యాయామం. అందుకే నిత్యం వాకింగ్ చేసేవారు ఆరోగ్యకరంగా ఉంటారు.

డైలీ వాకింగ్ చేసేవారికి గుండె పోటు సమస్య 19 శాతం తక్కువగా ఉంటుంది.

30 నిమిషాలు నిత్యం నడిస్తే.. మీ శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఊబాకాయులు త్వరగా బరువు తగ్గుతారు.

వాకింగ్ చేస్తే.. డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి.

ఎక్కువగా నడిచే వారి కాళ్లు, నడుము, వీపు.. కండరాలు, ఎముకలు బలంగా ఉంటాయి.

భోజనం తరువాత 30 నిమిషాలు నడిస్తే.. భోజనం బాగా జీర్ణం అవుతుంది.

వాకింగ్ ఒక హాబీగా చేసేవారు ఎక్కువ కాలం జీవిస్తారని చాలా అధ్యయనాల్లో తేలింది.